Friday, June 25, 2010

నేను ఎవరు ?


తుఫాను కు ముందు వచ్చే భారీ ఆకారాన్ని
నాకు రక్తము లేదు , ఎముకలూ లేవు
కాని ఇళ్ళనూ , పెద్ద పెద్ద చెట్లనూ ద్వంసం చేయగలను

మనుష్యులకు , మొక్కలకూ మిత్రురాలిని
సమస్త ప్రాణకోటికి ఆధారాన్ని
నా శక్తిని ఉపయోగించి విద్యుత్ ను ఇవ్వగలను
భారీ నౌకలనూ నడపగలను

భూగోళం చుట్టూ తిరుగుతుండే దానిని
మనుషుల తప్పులకు అనేక విష రసాయలను
నాలో దాచుకున్నా భాద చెప్పలేని మూగ దానిని
మీరు అరాధించే పంచ భూతాలలో ఒకటైన దానిని

నేను ఎవరు ?

Monday, June 21, 2010

దయ్యాల పెట్టె

అప్పుడు

చిన్నప్పుడు మేము మారాం చేస్తున్నామని మా నాన్నగారు
నలుపు తెలుపులలొ ఉన్న చిన్న పెట్టెను కొనిపెట్టారు
ఒక చిన్న దయ్యం గాలిలో నుండి ప్రవేశించింది
అది కొన్ని గంటలు మాత్రమే కనిపించేది
కొన్ని నిముషాలు ప్రపంచం లో జరిగిన సంగతులు చూపించేది
శుక్రవారం పాటలు పాడేది, ప్రతి శనివారం చిత్రాన్ని చూపించేది
ఇక ప్రతి రోజు పాడిపంటలు, పందుల కార్యక్రమం మామూలే
అది మా జీవితం లొ ఒక భాగం అయిపోయింది
ఒకొక్కప్పుడు పెట్టె మూసుకు పోయినా ,
దయ్యం కనపడక పోయినా చాలా భాదపడిపోయే వాళ్ళం
అంతరాయానికి చింతించే వాళ్ళం

ఇప్పుడు

అందరి ఇళ్ళలోనూ రంగుల పెట్టెలు వచ్చేసాయి
తీగల ద్వారా వచ్చిన పెద్దపెద్ద దయ్యాలు సందడి చేసాయి
వాటికి కొన్ని పిల్ల దయ్యాలు కూడా తోడయ్యాయి
వందల కొద్ది దయ్యాలని చూడాలని
మా కళ్ళు రంగుల మయం కావాలని
రంగుల దయ్యం పెట్టె కావాలని
మా నాన్న గారిని మళ్ళి కోరాం ,కాదనలేదు
ఉదయం నుండి అర్ధరాత్రి వరకూ దయ్యాల సందడే సందడి
అయిదు నిముషాల కథను ఆరు సంవత్సరాలు చూపించేవి కొన్ని
చూపించిందే చూపించే వార్తా దయ్యాలు కొన్ని
బొమ్మల కథలను చూపించే పిల్ల దయ్యాలు కొన్ని
పాడిన పాటనే పాడి వినిపించే సంగీత దయ్యాలు కొన్ని
బాబోయ్ ఈ దయ్యాల గోలని భరించలేక పోయాము
మన జీవితాలలో ఈ దయ్యాలు చేసిన అల్లరికి అంతులేదు
తీగలను తెంపేసి , దయ్యాల పెట్టెను పాడు బడ్డ బావిలో పూడ్చి పెట్టాను
వృధా చేస్తున్న సమయం లో ఒక విద్య ను నేర్చుకుంటున్నాను
జీవితాన్ని రంగులమయం చేసుకున్నాను.

Sunday, February 21, 2010

నా కవితకు ప్రాణం నీవు

విషాదం నిండిన మనసులో
సంతోషాన్ని నింపావు
బిడియం తో ఉన్న నాకు
అల్లరిని నేర్పావు
కలలే రాని నాకు
కవితలే నేర్పించావు
వర్ణాలు తెలియని నాకు
నీ రంగుల స్వప్నం చూపించావు
నా కవితకు ప్రాణం నీవు
నిను విడిచి ఉండలేను

నీ కోసం

ఉదయించిన సూర్యున్ని అడిగా
నీవు క్షేమమా అని
చల్లగా వీచే గాలులను అడిగా
నీ చిరునవ్వులు ఏవి అని
పున్నమి వెన్నెల వెలుగుని అడిగా
నీ మంచి మనస్సు ఎక్కడని
వనం లోను పూలను అడిగా
నీ పరిమళం ఏది అని
ఆకాశం లో మబ్బులను అడిగా
నీ జాడ ఎక్కడ అని
కనిపించిన ప్రతి శిలను అడిగా
నీవు ఎక్కడ అని
సెలయేరు సవ్వడిని అడిగా
నీ మువ్వల సవ్వడి వినాలని
నీతో మాట్లాడాలని
కన్నిళ్ళు ఇంకిన మనసుతో
నీ కోసం ఎదురు చూస్తున్నా

Wednesday, February 3, 2010

నీ తోడు కావాలని

మొన్న కనిపించిన
నీ అందం నన్ను
మరపింపచేసింది
నా కనుపాపలలో
నీ రూపం
విడిచివెళ్ళనంటుంది
రెప్పల మాటున
అది దాగుండిపోయింది
నిదురలోనూ
నీ ప్రతిబింబం నన్ను
తట్టి లేపింది
నీ వెంటే నేనున్నానంటూ నన్ను
పలుకరించింది
నా ఉచ్చ్వాస నిశ్వాసలోనూ
నీ పూల పరిమళం
పూరించివేసింది
ప్రతి నా శరీరపు
ప్రతి అణువునూ అది
మత్తెకిస్తూంది
నా గుండె చప్పుడును
నీ చిలిపి అల్లరి
బందించివేసింది
ప్రతి లయ నీ తోడు
కోరుకుంటూంది
దూరంగా ఉన్న
మన తనువులు
దగ్గరవ్వాలని
ఒక్కటైన మన హౄదయం
ఆశపడుతుంది

Friday, January 29, 2010

పసివాడు

గతం తలుచుకుని దిగులు చెందడు
భవిష్యత్ గురించి ఆరాట పడడు

తనకు శత్రువులు లేరు
అలా అని మిత్రులూ లేరు

ఆశా లేదు
నిరాశా లేదు

తను అందం అన్న ప్రీతి లేదు
కురూపి అయినా భాధ లేదు

లోకం పోకడ తెలియని
పాల బుగ్గల పసివాడు

కల్మషం లేని
'పసిడి' వాడు

Thursday, January 28, 2010

నా చెలి

నా చెలి కురులు
సాగరుని కెరటాలు
నయనాల నయగారాలు
జాబిలి పరవశాలు
నా చెలి చెక్కిలిలు
పాలమీగడ పులకరింతలు
ఆమె చిరునవ్వు
తేనె లాంటి మథురాలు
తన అధరాలు
పూల పరిమళాలు
తన పలుకరింపులు
కోయిల గానాలు
ఆమె మనస్సు
చల్లని వెన్నెల సొగసు
ఆమె నడకలు
సొగసైన పవనాలు
తీరాలు దాటిన నా చెలి
నా మనసు మెచ్చిన నా ప్రియసఖి