Monday, June 21, 2010

దయ్యాల పెట్టె

అప్పుడు

చిన్నప్పుడు మేము మారాం చేస్తున్నామని మా నాన్నగారు
నలుపు తెలుపులలొ ఉన్న చిన్న పెట్టెను కొనిపెట్టారు
ఒక చిన్న దయ్యం గాలిలో నుండి ప్రవేశించింది
అది కొన్ని గంటలు మాత్రమే కనిపించేది
కొన్ని నిముషాలు ప్రపంచం లో జరిగిన సంగతులు చూపించేది
శుక్రవారం పాటలు పాడేది, ప్రతి శనివారం చిత్రాన్ని చూపించేది
ఇక ప్రతి రోజు పాడిపంటలు, పందుల కార్యక్రమం మామూలే
అది మా జీవితం లొ ఒక భాగం అయిపోయింది
ఒకొక్కప్పుడు పెట్టె మూసుకు పోయినా ,
దయ్యం కనపడక పోయినా చాలా భాదపడిపోయే వాళ్ళం
అంతరాయానికి చింతించే వాళ్ళం

ఇప్పుడు

అందరి ఇళ్ళలోనూ రంగుల పెట్టెలు వచ్చేసాయి
తీగల ద్వారా వచ్చిన పెద్దపెద్ద దయ్యాలు సందడి చేసాయి
వాటికి కొన్ని పిల్ల దయ్యాలు కూడా తోడయ్యాయి
వందల కొద్ది దయ్యాలని చూడాలని
మా కళ్ళు రంగుల మయం కావాలని
రంగుల దయ్యం పెట్టె కావాలని
మా నాన్న గారిని మళ్ళి కోరాం ,కాదనలేదు
ఉదయం నుండి అర్ధరాత్రి వరకూ దయ్యాల సందడే సందడి
అయిదు నిముషాల కథను ఆరు సంవత్సరాలు చూపించేవి కొన్ని
చూపించిందే చూపించే వార్తా దయ్యాలు కొన్ని
బొమ్మల కథలను చూపించే పిల్ల దయ్యాలు కొన్ని
పాడిన పాటనే పాడి వినిపించే సంగీత దయ్యాలు కొన్ని
బాబోయ్ ఈ దయ్యాల గోలని భరించలేక పోయాము
మన జీవితాలలో ఈ దయ్యాలు చేసిన అల్లరికి అంతులేదు
తీగలను తెంపేసి , దయ్యాల పెట్టెను పాడు బడ్డ బావిలో పూడ్చి పెట్టాను
వృధా చేస్తున్న సమయం లో ఒక విద్య ను నేర్చుకుంటున్నాను
జీవితాన్ని రంగులమయం చేసుకున్నాను.

No comments: