Monday, July 2, 2012

జో జో జో జో


ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రీ
భావిభారత బాల వీరుడవు నీవు
పుట్టీనావీ వీర పుణ్యదేశాన
మన దేశమున పాపలేడువగరాదు
బాల చంద్రుడు నిన్ను పరిహసిస్తాడు
వీరశివాజీ నిను వెక్కిరిస్తాడు
నిలపరా నీ జాతి పూర్వశౌర్యాన్ని
తెలుపరా నీ తల్లి దివ్య తేజాన్ని  

---------------------------------------------------------------------------------
గమనిక : ఇప్పటివరకూ ఈ బ్లాగులో రాసినవన్ని నా స్వంత ఆలోచనలే కాని ఇది మాత్రం నేను రాసినది కాదు. ఒక సారి పాత పుస్తకాలన్ని సర్దుతున్నపుడు మా నానమ్మ గారి పుస్తకం ఒకటి కనపడింది. ఇది అందులో కనపడింది. ఇది మా నాన్నమ్మ గారి చేతి వ్రాత కాని ఈ కవిత/పాట ఎవరిదో తెలీదు. అడుగుదామనుకుంటే ఆవిడ ఈ లోకం లో లేరు. బాగా ఉత్తెజపరిచెదిలా ఉందని నా బ్లాగు లో పెడుతున్నాను.  ఇది 1952 లో రాసింది.  


1 comment:

the tree said...

oka, manchi jnapakam.