Friday, June 25, 2010

నేను ఎవరు ?


తుఫాను కు ముందు వచ్చే భారీ ఆకారాన్ని
నాకు రక్తము లేదు , ఎముకలూ లేవు
కాని ఇళ్ళనూ , పెద్ద పెద్ద చెట్లనూ ద్వంసం చేయగలను

మనుష్యులకు , మొక్కలకూ మిత్రురాలిని
సమస్త ప్రాణకోటికి ఆధారాన్ని
నా శక్తిని ఉపయోగించి విద్యుత్ ను ఇవ్వగలను
భారీ నౌకలనూ నడపగలను

భూగోళం చుట్టూ తిరుగుతుండే దానిని
మనుషుల తప్పులకు అనేక విష రసాయలను
నాలో దాచుకున్నా భాద చెప్పలేని మూగ దానిని
మీరు అరాధించే పంచ భూతాలలో ఒకటైన దానిని

నేను ఎవరు ?

1 comment:

ఓ బ్రమ్మీ said...

నాకు రెండు సమాధానాలు కనబడుతున్నాయి.. ఒకటి టోర్నిడో, అదేనండి సుడిగాలి.. లేదా మరొకటి ఓజోన్ లేయర్