Monday, August 22, 2011

అమ్మా,నాన్నా ప్లీజ్ నన్ను చంపొద్దు





పాల బుగ్గల నునుపుతో
మన ఇంట్లో చిరునవ్వులు చిందిస్తా
గజ్జెల సవ్వడితో
సంగీతం వినిపిస్తా
అమ్మకు బాగోలేకపోతే
ప్రేమతో అన్నం తినిపిస్తా
నాన్న కు వయసు మీరితే
నే కూడా సంపాదిస్తా

మంచి చదువులు చదివి నేను
మేడం క్యూరిని అవుతా
దేశాన్ని పరిపాలించిన
ఇందిరను అవుతా
విశ్వం లో విహరించిన
సునీతాను అవుతా

దైవం చెప్పిన నిజాన్ని
నేను నీ కలలో చెప్పుతున్నా
కొడుకు పెట్టిన తలకొరివితో నీవు
స్వర్గానికి వెళదామనుకున్నావు,
కాని ఆడపిల్లనని కడుపులోన
నన్ను చంపి నరకానికి వెళ్ళొద్దు

అమ్మా,నాన్నా ప్లీజ్ నన్ను చంపొద్దు



Saturday, August 20, 2011

వీడ్కోలు


చల్లని ఆడవిలో
ప్రేమ నిండిన మనసుతో
అమ్మ ప్రేమ అనురాగం తో
పెరుగుతున్న జింకపిల్ల
కౄరమైన వేటగాడి
బాణానికి మరణించింది
తన తల్లికి కన్నీరు మిగిల్చింది

కల్లొల సముద్రంలో
సునామీ తాకిడికి
ఒక భారీ నౌక
ఒడ్డున చేరి
విగతజీవిగా మారింది
సాగరం తో తన అనుబందం
కోల్పోయింది

దూరమైన ప్రేయసి ఆలోచనలతో
విషాద వదనంతో
జీవితం అంథకారంలో ఉన్న
ఒంటరి బాటసారికి
మిణికుమిణికుమన్న
అందమైన నక్షత్రం పలుకరించింది
వెనువెంటనే అది రాలిపోయింది
ఈ విశ్వాన్ని అది వీడిపోయింది
నక్షత్రాలే మరణించినప్పుడు
చిన్న మనసుల మనుష్యులం మనం
ఎలా ఈ బందాలు శాశ్వతం ?