Friday, January 29, 2010

పసివాడు

గతం తలుచుకుని దిగులు చెందడు
భవిష్యత్ గురించి ఆరాట పడడు

తనకు శత్రువులు లేరు
అలా అని మిత్రులూ లేరు

ఆశా లేదు
నిరాశా లేదు

తను అందం అన్న ప్రీతి లేదు
కురూపి అయినా భాధ లేదు

లోకం పోకడ తెలియని
పాల బుగ్గల పసివాడు

కల్మషం లేని
'పసిడి' వాడు

Thursday, January 28, 2010

నా చెలి

నా చెలి కురులు
సాగరుని కెరటాలు
నయనాల నయగారాలు
జాబిలి పరవశాలు
నా చెలి చెక్కిలిలు
పాలమీగడ పులకరింతలు
ఆమె చిరునవ్వు
తేనె లాంటి మథురాలు
తన అధరాలు
పూల పరిమళాలు
తన పలుకరింపులు
కోయిల గానాలు
ఆమె మనస్సు
చల్లని వెన్నెల సొగసు
ఆమె నడకలు
సొగసైన పవనాలు
తీరాలు దాటిన నా చెలి
నా మనసు మెచ్చిన నా ప్రియసఖి