Saturday, December 31, 2011

దూరంగా ఉన్న నా ప్రేయసికి ఇలా శుభాకాంక్షలు తెలుపుతున్నా


ఉదయించిన సూర్యుని కిరణాలను అడిగా
నా ప్రేయసి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పమని
అవి నల్లని మబ్బుల మాటున దాగుండి పోయాయి


రాత్రి చంద్రుడిని కూడా అడిగా
ఆ విషయం మరిచి ఉదయం లేచేసరికి అది 
వేరొక చోటికి వెళ్ళిపోయింది.


దూరంగా వస్తున్న సముద్రపు అలలని అడిగా
ఆమె ఉన్న చోటు కి ప్రయాణం చేయలేనన్నవి 
ఆకాశం లొ ఉన్న ఇంద్రదనస్సుని అడిగా
నా మాట వినేలోగా అది మాయమయ్యిపోయింది


విచారం నిండిన మనస్సుతో ఒక గులాబీ మొక్కతో 
నా బాదను వ్యక్తపరుచుకున్నా
నా ప్రేయసితో శుభాకాంక్షలు చెప్పమని వేడుకున్నా


ఆ మొక్క 2012 సంవత్సరపు బుట్టలో 
నాకు 12 నెలలకు గుర్తుగా 12 గులాబీలను ఇచ్చింది 
ప్రేమ నిండిన మనస్సుతో అవి ఆమెకు పంపిస్తున్నా


దూరంగా ఉన్న నా ప్రేయసికి ఇలా శుభాకాంక్షలు తెలుపుతున్నా .













Friday, December 16, 2011

నా ప్రేయసి





కొలనులో ఒంటరిగా ఉన్న కలువ పూవు
చల్లని చంద్రుని వెన్నెలకోసం ఎదురుచూస్తున్నది


దూరంగా ఉన్న సముద్రపు కెరటం
భూమిని తాకాలని వేచిఉన్నది


శీతాకాలపు పొగమంచు అప్పుడే వికసించిన
గులాబీని తాకి నీరుగా మారిపోవాలనుకుంది


ఒంటరిగ ఉన్న నా హ్రుదయం
దూరంగా ఉన్న ప్రేయసి పిలుపు కోసం వేచియున్నది


(ఈ కవిత నాకు కాబోయే భార్య కోసం రాసుకున్నది )





Thursday, September 8, 2011

ఒక ఆకారం


అటుగా వెళుతున్న నాకు ఒక
ఆకారం కనిపించింది
నేను పలుకరించాలనుకున్నా
తను కూడా పలుకరించింది
నేను మాట్లాడాలనుకున్న
తను కూడా మాటలు నాతో కలిపింది
నేను చిరునవ్వులు చిందించా
తను కూడా చిరునవ్వులు చిందించింది
కోపం వచ్చి గట్టిగా అరిచా
తనుకూడా నాతోపాటే అరిచింది
అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నా.
వెళ్ళిపోతూ వెనక్కు తిరిగి చూసా
మళ్ళీ కనిపించింది
ఎవరా వ్యక్తి నన్నే చూస్తున్నది?
అప్పుడు గుర్తొచ్చింది
అది అద్దంలో నా ప్రతిబింబమే కదూ !

Monday, August 22, 2011

అమ్మా,నాన్నా ప్లీజ్ నన్ను చంపొద్దు





పాల బుగ్గల నునుపుతో
మన ఇంట్లో చిరునవ్వులు చిందిస్తా
గజ్జెల సవ్వడితో
సంగీతం వినిపిస్తా
అమ్మకు బాగోలేకపోతే
ప్రేమతో అన్నం తినిపిస్తా
నాన్న కు వయసు మీరితే
నే కూడా సంపాదిస్తా

మంచి చదువులు చదివి నేను
మేడం క్యూరిని అవుతా
దేశాన్ని పరిపాలించిన
ఇందిరను అవుతా
విశ్వం లో విహరించిన
సునీతాను అవుతా

దైవం చెప్పిన నిజాన్ని
నేను నీ కలలో చెప్పుతున్నా
కొడుకు పెట్టిన తలకొరివితో నీవు
స్వర్గానికి వెళదామనుకున్నావు,
కాని ఆడపిల్లనని కడుపులోన
నన్ను చంపి నరకానికి వెళ్ళొద్దు

అమ్మా,నాన్నా ప్లీజ్ నన్ను చంపొద్దు



Saturday, August 20, 2011

వీడ్కోలు


చల్లని ఆడవిలో
ప్రేమ నిండిన మనసుతో
అమ్మ ప్రేమ అనురాగం తో
పెరుగుతున్న జింకపిల్ల
కౄరమైన వేటగాడి
బాణానికి మరణించింది
తన తల్లికి కన్నీరు మిగిల్చింది

కల్లొల సముద్రంలో
సునామీ తాకిడికి
ఒక భారీ నౌక
ఒడ్డున చేరి
విగతజీవిగా మారింది
సాగరం తో తన అనుబందం
కోల్పోయింది

దూరమైన ప్రేయసి ఆలోచనలతో
విషాద వదనంతో
జీవితం అంథకారంలో ఉన్న
ఒంటరి బాటసారికి
మిణికుమిణికుమన్న
అందమైన నక్షత్రం పలుకరించింది
వెనువెంటనే అది రాలిపోయింది
ఈ విశ్వాన్ని అది వీడిపోయింది
నక్షత్రాలే మరణించినప్పుడు
చిన్న మనసుల మనుష్యులం మనం
ఎలా ఈ బందాలు శాశ్వతం ?