Sunday, February 21, 2010

నా కవితకు ప్రాణం నీవు

విషాదం నిండిన మనసులో
సంతోషాన్ని నింపావు
బిడియం తో ఉన్న నాకు
అల్లరిని నేర్పావు
కలలే రాని నాకు
కవితలే నేర్పించావు
వర్ణాలు తెలియని నాకు
నీ రంగుల స్వప్నం చూపించావు
నా కవితకు ప్రాణం నీవు
నిను విడిచి ఉండలేను

నీ కోసం

ఉదయించిన సూర్యున్ని అడిగా
నీవు క్షేమమా అని
చల్లగా వీచే గాలులను అడిగా
నీ చిరునవ్వులు ఏవి అని
పున్నమి వెన్నెల వెలుగుని అడిగా
నీ మంచి మనస్సు ఎక్కడని
వనం లోను పూలను అడిగా
నీ పరిమళం ఏది అని
ఆకాశం లో మబ్బులను అడిగా
నీ జాడ ఎక్కడ అని
కనిపించిన ప్రతి శిలను అడిగా
నీవు ఎక్కడ అని
సెలయేరు సవ్వడిని అడిగా
నీ మువ్వల సవ్వడి వినాలని
నీతో మాట్లాడాలని
కన్నిళ్ళు ఇంకిన మనసుతో
నీ కోసం ఎదురు చూస్తున్నా

Wednesday, February 3, 2010

నీ తోడు కావాలని

మొన్న కనిపించిన
నీ అందం నన్ను
మరపింపచేసింది
నా కనుపాపలలో
నీ రూపం
విడిచివెళ్ళనంటుంది
రెప్పల మాటున
అది దాగుండిపోయింది
నిదురలోనూ
నీ ప్రతిబింబం నన్ను
తట్టి లేపింది
నీ వెంటే నేనున్నానంటూ నన్ను
పలుకరించింది
నా ఉచ్చ్వాస నిశ్వాసలోనూ
నీ పూల పరిమళం
పూరించివేసింది
ప్రతి నా శరీరపు
ప్రతి అణువునూ అది
మత్తెకిస్తూంది
నా గుండె చప్పుడును
నీ చిలిపి అల్లరి
బందించివేసింది
ప్రతి లయ నీ తోడు
కోరుకుంటూంది
దూరంగా ఉన్న
మన తనువులు
దగ్గరవ్వాలని
ఒక్కటైన మన హౄదయం
ఆశపడుతుంది