Saturday, December 9, 2006

మల్లెపూవు


పక్షుల కిలకిల రావములతో
సెలయేరు గలగల సవ్వడిలో
తుమ్మెదల ఝుంకార నాదం తో
అమ్మ ఒడి అనురాగం తో
నిండిన తోటలో పెరిగిన నన్ను
కసాయి తోటమాలి తుంచేసాడు

పడుచు పిల్ల కొప్పులో
అందంగా ఉండాలనుకున్నా
పవిత్ర దేహాల సంగమానికి
అలంకారిణి అవుదామనుకున్నా

కానీ వేశ్యావాటికలో
విటుల చేతికి బందించబడ్డాను
వారి తాపాగ్ని కి భలి అయిపోయాను.

ఓ కార్మికుని భార్య


ప్రతి నెలా ఒక రోజు
మంచి చీర కట్టుకుని
నలగని జాకెట్టు వేసుకుని
తన భర్త పూలు తెస్తాడని
ఎదురు చూస్తూ ఉంటుంది
ఓ కార్మికుని భార్య

ఎంతుకంటే ఆ రోజు జీతాల రోజు కాబట్టి
తరువాత రోజు నుండి కష్టాలు ఉండబట్టి

ప్రణయ కావ్యం


హ్రుదయం లో పరిచయాన్ని
నా కలం లో సిరా గా నింపుకున్నా

పరిచయ అక్షరాల అభిమానాన్ని
ప్రేమ అనే పదాలుగా రాస్తున్నా

ప్రేమ పదాల వాఖ్యాన్ని
ప్రణయ కావ్యం గా రూపోందించుకుంటున్నా

బట్టతల



అతని మెదడు నిండా ఉన్న
తన ప్రియురాలి అలోచనలు
ఒక్కొక్క వెంట్రుకను తినేసాయి

కాని ప్రియురాలు దూరం అయ్యింది
చివరకు బట్టతల మిగిలింది

అందం


అలల మద్య ఒంటరిగా ఉన్న శిల
కెరటాల రాపిడిని ఎదుర్కుంటుంది
బలహీనమైన ఇసుక రేణువులు గా మారుతుంది

అగ్ని పర్వతాల మద్య ఉన్న శిల
అధిక వేడిని ఎదుర్కొంటుంది
పల్చని లావా గా మారి
తన రూపాన్ని కోల్పోతుంది

జీవం లేని శిలలే వాటి రూపం కోల్పోయినప్పుడు
వయసు తో మారే మన అందం మన సొంతం కాదుగా.

కుక్క పిల్ల


ఇంటికి రాగానే అప్యాయతతో
ఎగురుతూ షేక్ హాండ్ ఇస్తుంది
నాకు ఒంట్లొ బాగోలేక పోతే
తాను భాదపడుతుంది

తిండి తిన్న విశ్వాసానికి
ప్రాణాలకు తెగించి ఇంటికి కాపలా కాస్తుంది

నవ్వు, అభిమానం తొడుగు వేసుకున్న
మనుష్యులం మనం
మనకు ఒక జంతువుకు ఎంత వ్యత్యాసం

కట్ణం


చిన్నప్పుడు చాక్లెట్ల కోసం
నాన్న తెచ్చిన బొమ్మ ఇచ్చేసాడు

పెద్దయ్యాక ఉద్యోగం కోసం
తన చదువును అమ్మేసాడు

ఇప్పుడు తన పెళ్ళి కోసం
తనను తాను అమ్ముకున్నాడు

ఆత్మ విశ్వాసం


భీడు పడ్డ్ భూమిని చూసి
మేఘం వర్షాన్ని ఇచ్చింది

సూర్యుని తాపాన్ని చూడలేక
రాత్రి చల్లని వెన్నెలను ఇచ్చింది

మునిగిపోతున్న మనిషిని
ఒక సముద్రపు అల ఒడ్డుకు తెచ్చింది

వైఫల్యాలు నిండిన మనిషికి
ఆత్మవిశ్వాసం విజేతగా నిలుపుతుంది

Friday, December 8, 2006

టెక్నాలజి


పక్కన ఉన్న ఇంటివాడికి
ఫోను చేసి హాయ్ చెబుతాం

నూతన సంవత్సరం రోజు
ఈ మెయిల్ గ్రీటింగ్ పంపిస్తాం

పార్టికి రమ్మని
యెస్ ఎమ్ యెస్ చేస్తాం

టెక్నాలజి ఎంత చేరువైతే
మనుషులు మనసులు అంత దూరం

రామక్రృష్ణ బీచ్




ఒడ్డున కూర్చుని
సముద్రాన్ని చూస్తే
అందంగా ఉంటుంది

మధ్య మధ్య రాళ్ళతో
దూరంగా ఉన్న ఓడలతో
చల్లని వెన్నెల చంద్రునిలా
ఒయ్యారంగా ఉంటుంది

అప్పుడప్పుడు అలలతో
ఆడుకుంటున్న కొందరిని
మింగేస్తుంటుంది

మాంత్రికుడు


ఎవరివో కష్టాలు
ఒపికగా వింటాడు

వారి జీవితాలను మారుస్తానని
తాయత్తులు ఇస్తుంటాడు

కానీ తన విధిని మార్చుకోలేని
అసమర్థుడు అతడు

సమయం వృధా


చిన్నప్పుడు నాన్న చదువుకోమంటే
సమయం వృధా చేసేవాడు

ఇప్పుడు రెండింతలు పనిచేస్తున్నాడు
వృధా చెయ్యడానికి సమయం ఎక్కడిది.

పిరికి ప్రేమికుడు


నేను ప్రేమిస్తున్నానని
మేఘం తో మొర పెట్టుకున్నా
ప్రియురాలిని చేరేలోపే
అది ఆనందంతో వర్షించి
కనుమరుగై పోయింది

సముద్రపు అలలతో
నా ప్రేమ విషయం సంభాషించా
ఆ అల నా కాళ్ళ దగ్గరే అలసిపోయింది

మా చందమామ తో కూడా చెప్పా
ఆ రోజు అతడు అలసి నిద్రపోయాడు
మరుసటి రోజు ఆ విషయం మరచిపోయాడు

ఒక జింక నా ప్రేమ విషయం చెబుతానన్నది
దారి మద్యలో వేటగాడి బాణానికి బలి అయ్యింది

అటుగా వెలుతున్న ఉడుత నాతో
ప్రేమను చెప్పడానికి భయపడే నీకు
ప్రేమించడం ఎందుకు అని అన్నది

Thursday, December 7, 2006

ఆమె ఆలోచనలు




నా ధమనుల్లొ సిరల్లొ
ఆమె ప్రేమ ప్రవాహమే

నా న్యురాన్ల నిండా ఆమె ఆలోచనలే
ప్రతి నరాల నిండా ఆమె శ్రుంగార భావనలే


ప్రతి అలోచన ఆమె ప్రేమను కోరుతుంది
ప్రతి అవయవము ఆమెను కోరుకుంటుంది.


ప్రేమ అనే ఎండమావి



జీవితమనే ఎడారిలో ఒంటరి బాటసారిని
ఎటు చూసినా ఇసుక తిమ్మెరలే

నిప్పులు కక్కుతున్న ఇసుకలో
కాలిన గాయాలతో ప్రయాణం సాగిస్తున్నాను

తడారిన గంతుకకుప్రేమ అనే ఒయాసిస్ కనిపించింది
ఎంత పయనించినా నిన్ను చేరలేక పొయాను
ఇప్పడే తెలిసింది ఇదంతా భ్రమ అని
అదొక ఎండమావి అని




క్రౄర మనసులు



క్రౄర జంతువులు కొన్ని
మనతో స్నెహం చేద్దామని

అడవిని వదిలి వచ్చేసాయి
పాపం వాటికేం తెలుసు
మనవి క్రౄర మనసులని

సెల్ ఫొన్



ఈ మద్య నా హ్రుదయం లో

ప్రేమ జ్వలించనంటుంది


దాని స్తానం లో

సెల్ ఫోన్ వచ్చిపడింది


గుండె కొట్టుకోవడం మానేసింది

రింగ్ టోన్ లే వినపడుతున్నాయి

పసివాడు




పండు వెన్నెలలో

ఊసుల ఊయలలో



నిదురిస్తున్న పాలబుగ్గల పసివాడు

చందమామను కావాలని మారాం చేసాడు



చందమామ కన్న అందమైన

నిన్ను చూసి పులకరించిపోయాడు




మరణించిన గులాబి


మనస్సు లేని మగువలకు సొగసుకత్తెను
మలినమైన మగాళ్ళకు ప్రేమ కానుకను

సమాధులపై అలంకారిని
రసికుల శృంగారం లో పాత్రధారిని

నేనే గులాభీని భాద చెప్పలేని మూగదాన్ని

రాయికే రోషమొస్తె

పశువులను హింసించి పాలు తీసి
తేనె టీగలను చెదరగొట్టి తేనె తీసి

పూల మొక్కలను గాయపరిచి పూలు కోసి
పండ్ల మొక్కలను వ్యదపరిచి పండ్లు కోసి

కంటికి కనిపించని నా కోసం పూజ చేస్తారు
నిన్ను ప్రేమించే పక్కవాడిని విస్మరిస్తారు

కలల కల్లలు


నీ మాటల సవ్వడిలో మరపింపచేస్తూ
నీ కను చూపులతో అల్లరి చేస్తూ

చిరు గాలికి చెదరిన కురులను మునివేళ్ళతో తీస్తూ
ఎగసిన పైటను సర్దుకుంటూ

చెదరని చిరునవ్వుతో పలుకరిస్తూ
నన్ను తోడుగా రమ్మని సైగ చేసావు

నీ అడుగులో అడుగునై సాగిపోదామనుకుంటే
కలల లాంటి అలలు కల్లలు చేసాయి

జూ పార్క్


పక్షుల కిలకిల రావములతో
చిరుగాలుల గలగల సవ్వడిలో


సెలయేరు నీటి తియ్యదనంలో
స్వెచ్చగా సంచరించే నన్ను


కాలుష్యం నిండిన నగరం లో
చిన్నారులు ఆనందించే


చెరసాలలో పడవేసారు.

పుట్టిన రోజు


నేడే నీ పుట్టిన రోజు
సాలుకు ఒకసారి వచ్చే పండుగ రోజు

కనులలో ఆశల హరివిల్లు
పెదవులపై చిరునవ్వులు విరజిల్లు

హ్రుదయంలో ఆనందపు పొదరిల్లు
మనసులో విరబూసిన మల్లెల జల్లు

జీవితం అంతా చిరునవ్వు చెరగకూడదని
మన స్నేహం చెరగకూడదని

మనసు


కనులు కనులు కలిస్తె
ఈ పగలే గడచిపోతుంది

తనువు తనువు కలిస్తె
ఈ రేయే గడచిపోతుంది

మనసు మనసు కలిస్తె
ఈ జీవితమే గడచిపొతుంది