Saturday, December 31, 2011

దూరంగా ఉన్న నా ప్రేయసికి ఇలా శుభాకాంక్షలు తెలుపుతున్నా


ఉదయించిన సూర్యుని కిరణాలను అడిగా
నా ప్రేయసి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పమని
అవి నల్లని మబ్బుల మాటున దాగుండి పోయాయి


రాత్రి చంద్రుడిని కూడా అడిగా
ఆ విషయం మరిచి ఉదయం లేచేసరికి అది 
వేరొక చోటికి వెళ్ళిపోయింది.


దూరంగా వస్తున్న సముద్రపు అలలని అడిగా
ఆమె ఉన్న చోటు కి ప్రయాణం చేయలేనన్నవి 
ఆకాశం లొ ఉన్న ఇంద్రదనస్సుని అడిగా
నా మాట వినేలోగా అది మాయమయ్యిపోయింది


విచారం నిండిన మనస్సుతో ఒక గులాబీ మొక్కతో 
నా బాదను వ్యక్తపరుచుకున్నా
నా ప్రేయసితో శుభాకాంక్షలు చెప్పమని వేడుకున్నా


ఆ మొక్క 2012 సంవత్సరపు బుట్టలో 
నాకు 12 నెలలకు గుర్తుగా 12 గులాబీలను ఇచ్చింది 
ప్రేమ నిండిన మనస్సుతో అవి ఆమెకు పంపిస్తున్నా


దూరంగా ఉన్న నా ప్రేయసికి ఇలా శుభాకాంక్షలు తెలుపుతున్నా .













6 comments:

Unknown said...

చాలా బాగుంది
మీ ప్రేయసి ఎక్కడున్నా మీ శుభాకాంక్షలు తప్పక చేరుతాయి...
నూతన సంవత్సర శుభాకాంక్షలు!

bhaskars blog said...

చిన్ని ఆశ గారు. దన్యవాదాలు. నా ప్రేయసి(=నాకు కాబోయే భార్య) ఎక్కడో కాదండి. హైదరాబాద్ లోనే ఉన్నారు. ఎదో సరదాగా ఇలా రాసుకున్నా.. నేను మొదట రాసుకుంది english లోనే . ఆమె కు తెలుగు చదవడం రాదు అందుకే ఇలా తెలుగులోనూ ఇంగ్లీషు లోనూ రాసుకుంటున్నా. ఇంగ్లీషు మన మాతృ భాష కాదు కాబట్టీ కొన్ని తప్పులు ఉండవచ్చు.

సరదాగా english లొ చదవండి

http://myenglishpoetry.blogspot.com/2011/12/to-my-fiancee-who-lives-far-away-from.html

Sai said...

చాలా బాగా రాశారు.. కచ్చితంగా ఆమెకి ఆ శుభాకాంక్షలు చేరుతాయి లేండి....

Sai said...

తమాషాగా రాసినా చాలా బాగుంది...

సుభ/subha said...

బాగుందండీ..నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

నందు said...

భాస్కర్ గారికీ, బ్లాగ్ మితృలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు