
పాల బుగ్గల నునుపుతో
మన ఇంట్లో చిరునవ్వులు చిందిస్తా
గజ్జెల సవ్వడితో
సంగీతం వినిపిస్తా
అమ్మకు బాగోలేకపోతే
ప్రేమతో అన్నం తినిపిస్తా
నాన్న కు వయసు మీరితే
నే కూడా సంపాదిస్తా
మంచి చదువులు చదివి నేను
మేడం క్యూరిని అవుతా
దేశాన్ని పరిపాలించిన
ఇందిరను అవుతా
విశ్వం లో విహరించిన
సునీతాను అవుతా
దైవం చెప్పిన నిజాన్ని
నేను నీ కలలో చెప్పుతున్నా
కొడుకు పెట్టిన తలకొరివితో నీవు
స్వర్గానికి వెళదామనుకున్నావు,
కాని ఆడపిల్లనని కడుపులోన
నన్ను చంపి నరకానికి వెళ్ళొద్దు
అమ్మా,నాన్నా ప్లీజ్ నన్ను చంపొద్దు