Wednesday, December 11, 2013

వద్దురా టి.వి. చూడోద్దురా ...........





యాంత్రిక జీవితాల మద్య సేదతీరుతున్నప్పుడు చూపించే సీరియల్సు 
అవి నమ్మకాలకు బీటలు వారిన సంబందాలకు నిదర్శనాలు 

పిల్లలతో అసభ్యకర దుస్తులతో చూపించే నృత్యాలు 
అవి మన భారతీయ సంస్కృతి కి తూట్లు పొడిచే ఆధారాలు 

పదే పదే  చూపించే రక్తపు మడుగులు చిత్రాలు 
అవి మన సున్నిత హృదయానికి పడిన గాట్లు

నాయకుల మద్య చర్చలు, విశ్లేషణలు కాదు అవి 
కూరగాయల బజారులో అరుపులు కేకలు 

పడకింటి విషయాలు, వ్యక్తిగత సంబందాల చర్చలు 
అవి కుటుంబంతో చూడలేని పనికి మాలిన విషయాలు.

వద్దురా టి.వి. చూడోద్దురా ...........